Wednesday, October 16, 2024

కాల్ మని చేసేవాళ్ళకు సీట్లా.. బుద్దా వెంకన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన కేశినేని

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత పగటి కలలు కంటుంటే..ఆ పార్టీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు..అధిపత్యపోరుతో నిత్యం గొడవలు పడుతూ… పార్టీ పరువును బాజారుకిడ్చుతున్నారు. మొన్నటి మొన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ ఇస్తే నాకే ఇవ్వాలని.. లేకపోతే బీసీలకు ఇవ్వాలని అంతేకాని కేశినేని నానికి ఇస్తే సహించేది లేదని కామెంట్స్ చేశారు బుద్దా వెంకన్న. తాజాగా దీనిపై స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.

మరోసారి ఆయన సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ప్రక్షాళన అవసరమని చెప్పుకొచ్చారు. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులకు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని నాని తేల్చి చెప్పారు. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవచ్చు, దావుద్ ఇబ్రహీం లాంటి వారిని, లాండ్ గ్రాఫర్ లకి, ఉమెన్జర్ కి ఇవ్వొచ్చు అంటూ సంక్రాంతి వేళ సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెంచారు. తాను ఎంపీని అయితేనే ఈ స్థాయికి రాలేదన్నారు. తనకు ఒక బ్రాండ్ ఉందని చెప్పుకొచ్చారు.

తన తమ్ముడు కేశినేని చిన్నికి మాత్రం సపోర్టు చేయనని నాని స్పష్టం చేశారు. భూకబ్జాదారులను, సెక్స్ ర్యాకెట్ నడిపేవాళ్లను, పేకాట క్లబ్ లను ఆడించేవాళ్లకు తన మద్దతు ఉండదని చెప్పుకొచ్చారు. టీడీపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు … బుద్దా వెంకన్నను ఉద్దేశించి చేసినవే అని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అప్పట్లో సెక్స్ ర్యాకెట్‌లో కేసులో బుద్దా వెంకన్న పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కాని అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో..ఆ కేసు నుంచి చాలా ఈజీగానే బుద్దా వెంకన్న బయటపడ్డారని టీడీపీ నేతలే చెబుతుంటారు. అందుకే కేశినేని నాని పరొక్షంగా బుద్దా వెంకన్నను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారని తెలుస్తుంది. మరి టీడీపీ నేతల మధ్య వార్ ఎప్పుడు తెర పడుతుందో చూడాలి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!