టీ ట్వంటీ ప్రపంచకప్ లో బ్యాటర్లు, బౌలర్లే కాదండోయ్ వరుణుడు కూడా ఆడుకుంటున్నాడు. మెగా టోర్నీలో పలు మ్యాచ్ లకు అడ్డుపడుతూ ఆయా జట్ల అవకాశాలను దెబ్బకొడుతున్నాడు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్ కూడా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ను రద్దు చేసారు అంపైర్లు. దీంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయించారు. మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు నుంచే మెల్ బోర్న్ లో వర్షం కురుస్తూనే ఉంది. వరుణుడు ఏమాత్రం తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ టోర్నీలో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ ల సంఖ్య మూడుకు చేరింది. అటు ఆఫ్ఘవిస్థాన్ ను వర్షం వెంటాడడం ఇది రెండోసారి. కివీస్ తో మ్యాచ్ కూడా వర్షంతోనే జరగలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆప్ఘనిస్థాన్ కింది నుంచి మొదటి స్థానంలో ఉండగా.. ఐర్లాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.