Thursday, November 7, 2024

వరల్డ్ కప్ లో మరో సంచలనం…టోర్నీ నుంచి విండీస్ ఔట్

- Advertisement -

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తాజాగా రెండు సార్లు ఛాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫైయింగ్ టోర్నీలోనే ఇంటిదారి పట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.విండీస్‌ బ్యాటర్లలో బ్రాండన్‌ కింగ్‌ 62 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే విండీస్‌ కెప్టెన్‌ పూరన్‌ తో సహా మిగిలిన వారు నిరాశపరిచారు. ఐర్లాండ్‌ బౌలర్లలో డెన్లీ మూడు, మెక్‌గ్రాతి, సిమి సింగ్ తలా వికెట్‌ సాధించారు. తర్వాత147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే చేధించింది. ఐరీష్‌ బ్యాటర్లలో ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ 43 బంతుల్లో 65 , బల్బిర్నీ 37 పరుగులతో ధాటిగా ఆడారు. వికెట్‌ కీపర్‌ టక్కర్‌ 45 పరుగులతో రాణించాడు. విండీస్ బౌలర్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. ఈ విజయంతో ఐర్లాండ్‌ సూపర్‌-12 కు అర్హత సాధించింది. అయితే ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ ను శాసించిన విండీస్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించిలేకపోవడం క్రికెట్ ఫాన్స్ కు తీవ్ర నిరాశకు గురి చేసింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!