Thursday, March 28, 2024

కీలక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్

- Advertisement -

2024లో జరిగిన ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా ప్రతీష్టాత్మకంగా మారనున్నాయి. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడటానికి సిద్దం అవుతున్నాయి. టీడీపీ , జనసేన , వైసీపీ. ఈ మూడు పార్టీలు మాత్రమే ఏపీలో యాక్టివ్ పొలిటిక్స్ చేస్తున్నాయి. టీడీపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది ఆ పార్టీ. చంద్రబాబు నేత‌ృత్వంలోని టీడీపీ పార్టీ ఆ ఎన్నికల్లో కేవలం 23 సీట్లను మాత్రమే సాధించింది. పార్టీ బ్రతకాలన్న… ప్రజల్లో నిలవాలన్న కూడా 2024 ఎన్నికలు ఆ పార్టీకి చాలా కీలకం. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ పెట్టి 12 ఏళ్లు అవుతున్న ఇప్పటి వరకు రాజకీయాల్లో ఏమాత్రం కూడా నిరుపించలేకపోయింది. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్..2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో అయిన గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కలలు కంటున్నారు. ఒంటరిగా వెళ్తే గెలుపు కష్టమనే టీడీపీతో చేతులు కలపడానికి కూడా పవన్ సిద్దం అవుతున్నారు.

ఇక అధికార వైసీపీ పార్టీ విషయానికి వస్తే,.. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలు చాలా కీలకం. 2019 ఎన్నికల్లో జగన్‌ను చూసి ఓటు వేసిన ప్రజలు..2024 ఎన్నికల్లో మాత్రం జగన్ పాలన చూసి ఓటు వేయాల్సి ఉంటుంది. జగన్ కూడా అదే చెబుతున్నారు. మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయవద్దని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. ఏది ఏమైనా కూడా 2024లో గెలుపు జగన్ కన్నా కూడా వైసీపీ కార్యకర్తలకు చాలా అవసరం. పొరపాటునా ఏదైనా జరిగితే.. పార్టీ కార్యకర్తలు చెల్లచేదరౌవుతారు. దీనిని దృష్టిలో పెట్టుకునే జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జగన్ తన ప్రత్యర్థుల మాదిరిగా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడరు.

తాను చేయాల్సింది చేసుకుంటూ పోతారు. దీనిలో భాగంగానే కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖారారు చేస్తున్నారు. జనసేనతో పొత్తు కారణంగా కొంత మంది టీడీపీ ముఖ్యులు సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అధికార వైసీపీ ముందుగా టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. సమీక్షల సమయంలోనే అభ్యర్ధులను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా చీరాల నుంచి కరణం వెంకటేష్ ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఆమంచి క్రిష్ణ మోహన్ గెలవగా, ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు. ఆ తరువాత కొంతకాలానికే కరణం బలరాం వైసీపీ సర్కార్‌కు మద్దతుగా నిలిచారు. కరణం..ఆమంచి.. పోతుల సునీత మధ్య టికెట్ కోసం పోటీ కొనసాగింది. అయితే, వైసీపీ అధినాయకత్వం ఆమంచిని ఒప్పించి పర్చూరు ఇంఛార్జ్ గా కేటాయించింది. ఫలితంగా ఇప్పుడు కరణం వెంకటేష్‌కు న చీరాలలో లైన్ క్లియర్ అయినట్లు అయింది. వెంకటేష్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన బీదా మస్తాన రావు త్వరలోనే సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. మరి వైసీపీ ఆవిర్భాం నుంచి చీరాలలో పార్టీ గెలిచింది లేదు. మరి 2024 ఎన్నికల్లో అయిన చీరాలలో వైసీపీ జెండా ఎగురుతుందో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!