Thursday, April 18, 2024

కోహ్లీ ప్లీజ్..రేపు సెలవు తీసుకో

- Advertisement -

వరల్డ్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎలాంటి స్టార్ బ్యాటరో అందరికీ తెలుసు… ప్రత్యేకించి ప్రత్యర్థి జట్లకు కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాక ఎలా ఆడతాడో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే జట్టును గెలిపించే వరకూ చెలరేగుతూనే ఉంటాడు. అందుకే కోహ్లీని ఎంత త్వరగా ఔట్ చేయాలనే దానిపైనే ప్రత్యర్థి జట్ల బౌలర్లు దృష్టి పెడతారు. ప్రస్తుతం కోహ్లీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మూడేళ్ళుగా పేలవ ఫామ్‌తో సతమతమైన విరాట్ ఆసియాకప్‌తో మళ్ళీ గాడిలో పడ్డాడు. ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. 5 మ్యాచ్‌లలో 246 పరుగులు చేసిన కోహ్లీ ఇప్పుడు భారత్ ఫైనల్ కు చేరడంలో కీలకం కాబోతున్నాడు. గురువారం అడిలైడ్ వేదికగా రెండో సెమీస్ జరగబోతోంది. భారత్, ఇంగ్లాండ్ తలపడనుండగా.. ఇప్పుడు ఇంగ్లీష్‌ టీమ్‌ను కలవరపెడుతున్న అంశం కోహ్లీ ఫామే.

కోహ్లీని త్వరగా ఔట్ చేయడం కంటే మ్యాచ్‌ ఆడకుండా ఉంటే బావుంటుందని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ళు కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లీ గురించి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ రేపు సెలవు తీసుకోవచ్చు కద్దా అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లీ తాను నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా… దానికి స్పందించిన పీటర్సన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీక్కుడా తెలుసు..కానీ గురువారం ఒక్కరోజూ డే ఆఫ్ తీసుకో ప్లీజ్ అంటూ సరదాగా రాసుకొచ్చాడు. కోహ్లీ,పీటర్సన్ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి అందరికీ తెలుసు.

కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు పీటర్సన్ మధ్ధతుగా నిలిచాడు. ఛాంపియన్‌ను తక్కువ అంచనా వేయొద్దంటూ కోహ్లీపై వచ్చిన విమర్శలకు పీటర్సన్ అప్పట్లో గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే గురువారం జరిగే సెమీస్‌లో తమ దేశంతోనే భారత్ ఆడనున్న నేపథ్యంలో పీటర్సన్ కోహ్లీని ఔట్ చేయలేకపోవడం కంటే అతను మ్యాచ్‌కు దూరమైతే బెటర్ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. గురవారం అడిలైడ్ వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లాండ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో రెండు జట్లూ నిలకడగా ఆడుతున్నాయి. టీమిండియా సూపర్ 12 స్టేజ్‌ను టాప్ ప్లేస్‌తో ముగిస్తే… ఇంగ్లాండ్ సెకండ్ ప్లేస్‌తో సెమీస్‌కు చేరింది. రెండు జట్లలోనూ టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్ ఉండడంతో మరో హోరారహోరీ పోరును అభిమానులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!