Thursday, March 28, 2024

నెదర్లాండ్స్ దెబ్బకు సౌతాఫ్రికా ఔట్..సెమీస్ లో భారత్

- Advertisement -

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది. పసికూన నెదర్లాండ్స్ సూపర్ 12 మ్యాచ్ లో సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆ జట్టు 13 రన్స్ తో సఫారీ టీమ్ పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 158 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో మైబుర్గ్, ఒద్వొడ్, టామ్ కూపర్ రాణించారు. చివర్లో అక్ర్ మాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 41 రన్స్ చేశాడు.

చేజింగ్ లో సఫారీ జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా వికెట్లు కోల్పోయింది. దికాక్ 13 , బవుమా 20 , రోస్కు 25, మక్ రం 17 రన్స్ కే ఔటయ్యరు. అంచనాలు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్ కీలక సమయంలో ఔటవడం ఆ జట్టు విజయావకాశాలని దెబ్బ తీసింది.చివర్లో క్లాసెన్ , కేశవ్ మహారాజ్ పోరాడినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడం వికెట్లు కోల్పోవడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అటు భారత్ జింబాబ్వే తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా సెమీస్ చేరింది. మరో సెమీస్ బెర్త్ కోసం పాక్ , బంగ్లాదేశ్ రేసులో ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!