ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ను వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఆయా జట్ల సెమీస్ అవకాశాలపై దీని ప్రభావం బాగానే పడింది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ రెండు వరుస విజయాలతో జోరు మీదుంది. ఆదివారం పెర్త్ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది. దాదాపు ప్రతీ మ్యాచ్ కూ వరుణుడు అడ్డుపడుతుండడంతో భారత్, సఫారీల పోరుకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందా అన్న అనుమానాలు ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. దీంతో ఆదివారం పెర్త్ వెదర్ ఎలా ఉందోనంటూ గూగుల్ లో ఫ్యాన్స్ తెగ శోదిస్తున్నారు. అక్కడి వెదర్ రిపోర్ట్ ప్రకారం భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ కు వర్షం అడ్డుపడే అవకాశాలు లేవు. ప్రస్తుతం అక్కడి వాతావరణం చల్లగానే ఉన్నప్పటకీ ఆదివారం వర్షం పడే అవకాశాలు లేవని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. దీంతో భారత క్రికెట్ అభిమావనులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గ్రూప్ 2 లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా సౌతాఫ్రికాపై గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తోంది. అటు సెమీస్ రేసులో నిలవాలంటే సఫారీ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.