ఓటును రక్షించడం, ఓటు విలువని కాపాడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఎన్నికల వ్యవస్థ అంటే .. ఎలక్షన్ కమిషన్ చాలా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తోంది. రోజు రోజుకి మరిన్ని అనుమానాలు పెరగడానికి కారణం అవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విమర్శకి, ఏ ఆధారానికి, ఏ ప్రశ్నకి, ఏ అనుమానానికి సమాధానం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. చివరికి ఎవరో ఇద్దరు ముగ్గురు వైకాపాకి సంబంధించిన అభ్యర్ధులు సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం ఈవీఎంలోని వి వి ప్యాడ్లను పరిశీలించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఒక మూడు చోట్ల అప్లై చేస్తే ఆ ప్రొసీజర్ ని ఫాలో అవ్వగుండా చేతులెత్తేసి నిజంగానే ప్రజాస్వామ్యంకి దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చారు. నలభై ఐదు రోజుల పాటు ఈవీఎంలలో వీవీ ప్యాడ్లలో డేటాని భద్రపరచాలని నిబంధనలు ఉన్నాయి. అయినా సరే ఎక్కడైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పరిష్కారం అయ్యేంత వరకు కచ్చితంగా డేటాని మూడేళ్ల వరకు అయినా సరే చాలా భద్రంగా దాచిపెట్టాలని ఎలక్షన్ కమిషన్కు నిబంధనలు ఉన్నాయి.
వీటిని ఆధారంగా చేసుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arun Kumar) కూడా కనీసం నలభై ఐదు రోజుల పాటు డేటా భద్రపరచాలి అంటే మరి ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే వీవీ ప్యాడ్లను కాల్చేయండి, ఈవీఎమ్లలో డేటాని తొలగించండి అని అప్పుడు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ముకేష్ కుమార్ మీనా ఎందుకు ఆర్డర్స్ ఇచారు అని అడిగితే దానికి ఎన్నికల కార్యాలయం చేసిన ట్వీట్ ఏంటి అంటే మేము డేటాని తొలగించమని చెప్పలేదు…డేటా భద్రంగానే ఉంది. కనీసం మూడేళ్ల వరకైనా సరే ఫిర్యాదులు ఉన్న చోట ఆ డేటాని భద్రపరుస్తామని చెప్పారు. మరి తాజాగా జరుగుతున్నది ఏంటి? విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడికి వెళ్లి ఆ ఈవీఎమ్లలో డేటా మరియు వీవీ ప్యాడ్లని పరిశీలించండి అంటే కలెక్టర్ గారి సమాధానం ఏంటి? ఈవీఎంలలో డేటా ని తొలగించేసారు. వీవీ ప్యాలలోని స్క్రిప్ట్ ని కాల్చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే మేము ఇది చేసాం. మాక్ పోలింగ్ తప్ప మేమేమి చేయలేము అని సమాధానం చెప్పారు.
ఇంత దారుణమా? ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? అని ప్రశ్నిస్తోంది వైసీపీ .. ఆ బ్యాటరీ శాతం ఎందుకు పెరిగింది అది చూపించండి అని అడిగితే దానికి భెల్ ఇంజనీర్ల సమాధానం ఏంటో తెలుసా? వాళ్లకు మరియు ఎన్నికల కమిషన్ కి ఉన్న ఒప్పందం లో ఈ టెక్నికల్ అంశం లేదంట. ఎలా పెరిగింది అంటే వాళ్లకి తెలీదంట. కానీ అసలు దాని మీద డిక్లరేషన్ ఇవ్వాలి దాని మీద నివృత్తి చేయాలి అంటే వాళ్ళ FOP లో అది లేదంట. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఆ టెక్నికల్ అంశమే లేదంట. జూన్ నాలుగు ఫలితాలు వస్తే జూన్ పదవ తేదీన వీళ్ళు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు పరిష్కారం అయ్యేంత వరకైనా కనీసం డేటా భద్రపరచాలి కదా. ఎందుకు కాల్చేసారు? ఎందుకు కాల్చేయమని ఆర్డర్లు ఇచ్చారు? ఇంత దుర్మార్గం ఏంటి? ఎంత అన్యాయ౦ ఇది.?