Thursday, April 18, 2024

జగన్‌కు మద్దతుగా జేడీ లక్ష్మీనారాయణ.. ప్రతి జిల్లా అభివృద్ది చెందలంటూ

- Advertisement -

మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఈ పేరు ఎవరు గుర్తు పెట్టుకున్న , పెట్టుకొకపోయిన వైసీపీ నాయకులు , కార్యకర్తలు మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటారు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో ఆయన్ను జైలుకు పంపించడంలో ఈ మాజీ సీబీఐ ఆఫీసర్ పాత్ర కూడా ఉందని వైసీపీ నాయకులు చెబుతుంటారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలతో కలిసి జగన్‌కు జైలుకు పంపించడంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుట్రలు పన్నారని అప్పట్లో గట్టిగానే ఆరోపణలు వినిపించాయి. అయితే జగన్ కేసులు అన్ని రాజకీయ కక్ష్యతోనే పెట్టినవి అని తెలుసుకున్న లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసి , రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆయన టీడీపీ పార్టీలో చేరుతున్నారని వార్తలు వినిపించిన్నప్పటికి తరువాత ఆయన పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి ఓడిన ఆయన , తరువాత పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కల్యాణ్ సిద్దాంతాలు నచ్చకే తాను పార్టీని వీడానని తెలిపారు.

అయితే ఆయన మాత్రం రాజకీయల నుంచి దూరం కాలేదనే చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణమాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తునే ఉన్నారు. ఆ మధ్య జగన్ పాలనపై కూడా కామెంట్స్ చేశారు.గతంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పరిపాలనపై కామెంట్స్ చేశారు. ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో , తన పాలనలో అదే చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు. మొదట్లో జగన్ ఎలా పరిపాలిస్తాడో అనే అనుమానం ఉండేది. కాని రాజ్యంగంపై ఆయనకు మంచి పట్టు ఉందని ఆ పరిపాలన ద్వారా అర్థం అయిందని చెప్పుకొచ్చారు. ఇక గ్రామాల్లో రాజకీయ దాడులు, అధిపత్య పోరు అనేది కామన్ అని తెలిపారు. తాజాగా ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. రాజధాని అంశంలో ఎవరి వాదన వారిదని.. దీనిపై కాలమే సమాధానం ఇస్తుందని. ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి రైతులను అడ్డుకోవడం మంచి పరిణమం కాదని జేడీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా అభివృద్ది చెందాలని తాను కోరుకుంటున్నామని.. అధికార వికేంద్రికరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని జేడీ చెప్పుకొచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మొదట ఆయన తిరిగి జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. తరువాత ఆయన ఆప్ నుంచి బరిలోకి దిగుతున్నారనే మరో వార్తం ప్రచారం అయింది. కాని ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగానే పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. ఏ పార్టీ నుంచి తాను నిల‌బ‌డ‌బోన‌ని తేల్చి చెప్పారు. త‌న సొంత చ‌రిష్మాతోనే పోటీ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. తన విజ‌యం ఖాయమని లక్ష్మీ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. మరి గతంలో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి అయిన గెలుస్తారో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!