మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధను చిత్ర రూపంలో తీసుకువస్తున్న దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ఆర్ జయంతి నాడు అభిమానుల కోసం టీజర్ రిలీజ్ చేయగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ బయోపిక్ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. “సమరశంఖం” అంటూ వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సాంగ్ ఈరోజు ఉదయం అభిమానుల కోసం విడుదల చేసారు.

వైఎస్ఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయిందని, ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 సంక్రాంత్రి పండుగ సమయంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానునట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియచేసింది. వైఎస్ఆర్ బయోపిక్ టీజర్, లిరికల్ సాంగ్ విడుదలతో ప్రచార కార్యక్రమాలలో ముందుకు దూసుకుకెళుతుంది.