అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ గత కొన్నేళ్లుగా ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో తాను ప్రతి శుక్రవారం హాజరు కాలేనని పెట్టుకున్న పిటిషన్ కొట్టివేస్తూ సీఎం అయినంత మాత్రాన మినహాయింపు ఇవ్వడం కుదరదని చెప్పడంతో ప్రతి శుక్రవారం హైదరాబాద్ వచ్చి కోర్టుకు హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈరోజు శుక్రవారం కావడంతో జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరవుతారని అందరూ భావించినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రి పర్యటన ఉండటంతో తను ఈరోజు కోర్టుకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టుని అభ్యర్ధించగా కోర్టు అంగీకరించింది. అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేయడం జరిగింది. ఇక జగన్ తన అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా హైకోర్టు ద్వారా ఊరట పొందాలని భావిస్తున్నారు.