ఎనిమిది నెలలు క్రితం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏవైతే తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని హామీలు ఇచ్చారో అవన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ఒక నూతన పధకాన్ని ఏప్రియల్ నెల నుంచి ప్రారంభించనుంది.

7 నుంచి 16 ఏళ్ళ వయస్సు గలిగిన పేద బ్రాహ్మణ కుటుంబాలలో ఉపనయనం(ఒడుగు) చేసుకోవడానికి 15 వేల చొప్పున ఆర్ధిక సాయం చేయనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పధకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీని కోసం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను కేటాయించనున్నారు. సీఎం జగన్ తాను ప్రజాసంకల్ప యాత్ర చేసే సమయంలో పేద బ్రాహ్మణులను ఆదుకుంటానని ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •