మన తెలుగు రాష్ట్రాలలో చెట్లను విరివిగా అడ్డమొచ్చాయని నరికేస్తుంటారు. ఇక పల్లేటూర్లలొ అయితే ప్రతి ఏడాది కరెంటు తీగలకు అడ్డు వస్తున్నాయని, పట్టణాలలో కూడా ఇలా రోడ్ల విస్తరణ పేరుతో మరొక విధంగా కూడా ఇష్టమొచ్చినట్లు నరికేస్తుంటారు. కానీ బెంగళూరు నగరంలో వ్యవహారం అలా ఉండదు. ఒక చెట్టు వారి ఇంటికి అడ్డు ఉన్నా ప్లాన్ మార్చి మరీ కట్టుకుంటారు తప్ప చెట్టు మాత్రం కూల్చరు.

కానీ బెంగళూరు లో ఒక వ్యక్తి తన ఇంటికి చెట్టు అడ్డముందని, చెట్టు వలన తన ఇల్లు ఎవరకి కనపడటం లేదని చెట్టును నరికివేయాలని ప్రయత్నిచాడు. కానీ చెట్టు నరకడానికి అనుమతి లభించలేదు. దీనితో ఏమి చేయాలో తెలియక చెట్టుకు మొత్తం 42 కన్నాలు పెట్టి దానికి విషం ఎక్కించి చంపాలనుకున్నాడు. కానీ అతడు కన్నాలు పెట్టి చంపబోయే సమయానికి చుట్టూ పక్కల వారికి విషయం అర్ధమయ్యి స్థానికులు డాక్టర్ ను పిలిపించి దానికి విరుగుడు ఇప్పించి చెట్టుని కాపాడుకున్నారు.

బెంగళూరు నగరంలో పొల్యూషన్ ధాటి నుంచి కాపాడుకోవడానికి ఒక్క చిన్న చెట్టును కూడా తొలగించకుండా అక్కడ స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఇలా చెట్టుని కాపాడుకోవడానికి డాక్టర్ తో విరుగుడు ఇప్పించి అతడికి చివాట్లు పెట్టారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా చెట్లు నరకడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోయినా బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్లు చెట్లు నరుకుతూ పర్యావరణానికి హాని తలపెడుతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •