ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారి నుంచి బయటపడాలని, తమకు సోకకుండా ఉండాలని ప్రజలంతా ఒకరకంగా ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇక ఇటలీలో అయితే 80 ఏళ్ళు పైబడిన వారిని తాము కాపాడలేమని చేతులెత్తేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందొ అర్ధమవుతుంది. వారం రోజులుగా ఇరాన్ కు చనిదినా 103 ఏళ్ళ బామ్మ కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆమెకు చికిత్స అందచేసి ఇప్పుడు నెగటివ్ రావడంతో ఆమెను ఇంటికి పంపించివేశారు. ఇటీవల అదే ఇరాన్ లో 91 ఏళ్ళ వృద్ధుడిని కూడా కరోనా నుంచి విముక్తి కల్పించారు.

నిన్న రాత్రి ఒక్కసారిగా తెలంగాణలో 6 నుంచి 13 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మరింత ఆందోళన గురిచేయడంతో కరీంనగర్ జిల్లా మొత్తం ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. రోజు రోజకి పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ ప్రభుత్వం ఎంతటి గట్టి చర్యలు తీసుకున్నా విదేశాల నుంచి వచ్చే వారితో ఇక్కడ స్థానికులు కూడా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా వైరస్ దెబ్బకు రాబోయే రోజులలో పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది.