కరోనా వైరస్ దెబ్బకు ఎవరు ఇళ్ల నుంచి 21 రోజులు బయటకు రావద్దని చెప్పడంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు తప్ప మిగతా ఎలాంటి షాపులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక కరోనా వైరస్ తో ఇంట్లోనే ఉండే వారు బార్బర్ షాప్ కు వెళ్లి గెడ్డం చేయించుకునే వారికి విపరీతమైన గెడ్డం పెరగడంతో ప్రతి ఒక్కరు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వలే తయారవుతారని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.

ఆర్టికల్ 370 దెబ్బకు ఒమర్ అబ్దుల్లా గత ఎనిమిది నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్నాడు. గత మూడు రోజుల క్రితం అతడికి నిర్బంధం నుంచి విముక్తి కల్పించడంతో అతడు ఎనిమిది నెలలు తరువాత మీడియా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో అతడు నిండుగా గెడ్డం పెంచుకొని కనపడ్డాడు. గత ఎనిమిది నెలలుగా గృహ నిర్బంధంలో ఉండటంతో ఇలా గుబురుగా గెడ్డం పెరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. దీనితో మన దేశంలో ఎంత మంది ఒమర్ అబ్దుల్లా వలే గెడ్డం పెంచుతారో చూడాలి. లాక్ డౌన్ 21 రోజులు అని చెబుతున్నా దాదాపుగా రెండు నుంచి మూడు నెలలు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని కొంతంది చెప్పుకు రావడం జరుగుతుంది. కరోనా వైరస్ పూర్తిగా అంతమొందితే తప్ప లాక్ డౌన్ నుంచి ప్రజలకు విముక్తి లభించే అవకాశం లేదు.