కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ కు మందు కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. త్వరలోనే మందు కనుకొంటామని కేంద్రం ప్రకటించింది. అయితే దీనికి వ్యాక్సిన్ కనుకొనడానికి ముందు ప్రజలందరూ తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కేవలం మన దేశానికి మాత్రమే ఉపయోగపడేలా కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని భారత శాస్త్రవేత్తలను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది.

మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు మరియు ఫార్మా సంస్థలు బలంగా ఉన్నాయని.. కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఏదైనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి 10 నుండి 15 ఏళ్ళు పడుతుందని.. కానీ మనం ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. భారత పరిశ్రమలు అకాడెమియాలోని 30 సమూహాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్రం తెలియచేసింది.

తెలంగాణకు పొంచి ఉన్న పాకిస్థాన్ మిడతలు.. సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

భూముల అమ్మకంపై టీటీడీ కీలక నిర్ణయం