రోగాలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు పేద, ధనిక మధ్య తరగతి ఏ దేశాలలోనైనా ఒకే విధంగా ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒక రోగంపై ఫోకస్ పెడుతుంటే మరొక రోగానికి చెందిన మరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక శాస్త్రీయ అధ్యయనం గురించి “ది లాన్ సెంట్” పత్రిక వివరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కాన్సర్ మరణాలు అత్యంత సాధారణంగా మారిపోయాయని, కాన్సర్ మరణాలు అభివృద్ధి చెందిన దేశాలలో అధికంగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనం ఏమి చెబుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా 2017లో 26 శాతం కాన్సర్ మరణాలు సంభవించాయని తెలియచేస్తుంది. ధనిక దేశాలలో గుండె జబ్బులకు సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోవడం వలన, గుండె జబ్బుల మరణాలు తగ్గి కాన్సర్ మరణాలు వాటా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మధ్య, పెద్ద దేశాలలో ఆరోగ్య సంరక్షణలో నాణ్యతతో పాటు ధనిక దేశాలలో ఆరోగ్య సంరక్షణలో నాణ్యత వ్యత్యాసం చక్కగా వివరించడం జరిగింది.

పేద, మధ్యతరగతి దేశాలలో హృదయ సంబంధిత రోగాలు ఎక్కువగా కనపడుతున్నాయని, గుండెజబ్బుల మరణాల వలన ఆ దేశాల నిష్పత్తిని పరిశీలిస్తే చాల ఆందోళన నెలకొని ఉందని వారు ఎక్కువగా అంటు రోగాలకు సంబంధించి ఫోకస్ పెడుతున్నారని, అంటు రోగాలపై ఫోకస్ తగ్గించి గుండెజబ్బుల నివారణపై దృష్టి పెట్టాలని తెలియచేసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •