గతంలో వైఎస్ జగన్ ప్రత్యేక హోదాకు మద్దతను తెలియచేయడానికి విశాఖ చేరుకుంటే, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా అటు నుంచి ఆటే హైదరాబాద్ తరలించి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను తీవ్ర అవమానానికి టీడీపీ సర్కార్ గురిచేసింది. ఆ తరువాత విశాఖ ఎయిర్పోర్ట్ లో కత్తి దాడి ఇలా జగన్ కు ప్రతిపక్ష నేతగా ఉండగా విశాఖ ఎయిర్పోర్ట్ సాక్షిగా చాలా అవమానాలు జరిగాయి.

అన్ని రోజులు మనవి కాదుగా కదా… ప్రతిపక్ష నేతకు మంచి రోజులొచ్చి సీఎం స్థానంలో కూర్చున్నాడు. ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడే, చంద్రబాబు నాయుడుని దెబ్బకు దెబ్బ తీయడంతో ఈరోజు విశాఖ ఎయిర్పోర్ట్ లో చేతగాని వాడిలా నాలుగు గంటలుగా కింద కూర్చుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. ఎంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నా చంద్రబాబును మాత్రం విజయవాడ తిరిగి వెళ్ళవలసిందిగా చెబుతున్నారు తప్ప ప్రజాచైతన్య యాత్రకు అయితే నో పర్మిషన్…. చంద్రబాబు నాయుడు ఆ రోజు అంతా నాదే అని విర్రవీగాడు… ఈరోజు అనుభవిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •