ఈమధ్య కాలంలో ఎంప్లాయిస్ పెన్షన్ స్కీంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంప్లాయిస్ తమకు పథ విధానమే కావాలని చాలా మంది పట్టుబట్టిన అందులోని మార్పులకు అనుగుణంగా మాత్రమే వర్తింపచేస్తూ గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోకసారి ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం (EPS) సవరించే దిశగా కేంద్ర అడుగులు వేస్తుంది. అందులో భాగంగా పిఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు 15 వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కంట్రిబ్యూషన్ స్కీం తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన సెంట్రల్ బోర్డు అఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో కూడా ఈ ప్రతిపాదన చర్చకు రావడంతో పాటు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.