తులసి భారతీయుల ప్రత్యక్షదైవం. దాదాపు అందరి వాకిళ్ళలో పూజలు అందుకొంటూ దర్శనమిస్తుంది.అలాంటి తులసి ఆకులు మన శారీరక సమస్యలను నివారించుకోవడానికి కూడా ఉపయోగ పడతాయి. తులసి ఆకులతో కాషాయం చేసుకొని తాగటం వలన జలుబు మరియు శ్వాస సంబంధమైన సమస్యలు తొలిగిపోతాయి .ఇంకా తులసి ఆకులని ఎండపెట్టి పొడి చేసుకోని నిల్వ ఉంచుకోవచ్చు.

ఈ చెట్టు ఆకులే కాదు, విత్తనాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. విత్తనాలతో ఐరన్, విటమిన్ K, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్ కారణంగా రక్తవృద్ధి జరుగుతుంది. తులసి గింజలను రోజు తినడం వలన కొల్లాజోన్ విడుదల మరింత పెరుగుతుంది. మనకు దెబ్బ తిన్న చర్మ కణాలు రావడంతో పాటు మరింత అందంగా కనపడటానికి తులసి విత్తనాలు చాలా ఉపయోగపడతాయి.