తెలంగాణాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మధ్య తగ్గినట్లు కనిపించిన కరోనా వైరస్ మళ్ళీ పుంజుకోవడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. ఇక గురువారం కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 1122 కి చేరింది. ఇక ఈ రోజు 45 మంది కరోనాతో పోరాడి డిశ్చార్జ్ కాగా, దీంతో డిశ్చార్జ్ అయిన కరోన బాధితుల సంఖ్య 693 కి చేరింది.

ఇక మరో 400 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 29 మంది మృతి చెందారు. ఇక కరోనా భారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉండడం కొంత ఊరట నిస్తుంది.