ఒకవైపున ఆర్ధిక మాంద్యం పొంచి ఉందని వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయని బయట ప్రచారం జరుగుతున్నా టాలెంట్ ఉన్నవారికి మాత్రం మంచి అవకాశాలు వస్తూ మంచి ప్యాకేజ్ తో ఉద్యోగాలలోకి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిలా దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగవ సంవత్సరం చదవవుతున్న విద్యార్థినులకు అమెజాన్ బారి ఆఫర్ ను ఇచ్చింది.

మధురిమ, శిరీష్ అనే ఇద్దరు విద్యార్థినులకు ఒకొక్కరికి 27 లక్షల రూపాయల వార్షిక వేతనం ఇవ్వనున్నారు. సెయింట్ మార్టిన్ కళాశాలలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో వీరికి ప్లేస్ మెంట్స్ లభించాయి. ఆ కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ విద్యార్థినులకు నియామక పాత్రలను అందచేశారు.