బిగ్ బాస్ 4 సీజన్ అత్యంత చప్పగా నాసిరకంగా అత్యంత పేలవమైన రేటింగ్స్ తో బిగ్ బాస్ 4 అన్ని సీజన్లలో డిజాస్టర్ గా నిలిచిపోయేలా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పటి వరకు నాలుగు వారాలు ముగియడంతో సూర్యకిరణ్, కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యారు. దేవి నాగవల్లి ఎలిమినేట్ అయితే ఎవరు ఊహించలేదు. ఆమె షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆమెను ఎలిమినేట్ చేయడం బాధించిందని చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తిరిగి దేవి నాగవల్లిని షోలోకి తీసుకువస్తారని అనుకున్నా కోవిడ్ నిబంధనలతో అది కష్టమని తెలుస్తుంది.

ఇక గత వారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ పరిస్థితి మరీ దారుణం షోలో కనీసం వారం రోజులు కూడా లేకుండా తెచ్చిన బ్యాగ్ మొత్తం బట్టలు బయటకు తీయకుండానే చాప చుట్టేసి బయటకు వచ్చేసింది. ఇదంతా ప్రేక్షకులకు ఆమెపై ఏర్పడిన చికాకు అని తెలుస్తుంది. మొదటి మూడు వారాలు బయట పరిణామాలను గమనించి షోలో ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్ చేసుకొని కొంతమందితో చనువుగా ఉండటానికి ప్రయత్నించడంతో అభిమానులకు నచ్చలేదు.

ఆమె షోలోకి వెళ్లిన మొదటి వారమే ఎలిమినేట్ కావడంతో స్వాతి దీక్షిత్ అభిమానులమని చెప్పుకుంటూ కొంతమంది అన్నపూర్ణ స్టూడియో ఎదుట ధర్నా చేస్తూ స్వాతిని బిగ్ బాస్ లోకి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకోవాలని ధర్నాకు దిగారు. వారిని అక్కడ నుంచి తరిమివేశారనుకోండి అది వేరే విషయం. స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తరువాత ఆమె ఎవరో తెలుసుకోవడానికి గూగుల్ చేస్తే తప్ప హీరోయిన్ అన్న సంగతి తెలియరాలేదు. తాను ఒక హీరోయిన్ అని చెప్పుకుంటున్న ఆమె చేసిన సినిమాలేవో టక్కున చెప్పేవారు ఒక్కరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో స్వాతి దీక్షిత్ “లేడీస్ అండ్ జెంటిల్మెన్, జంప్ జిలాని” అనే రెండు సినిమాలలో నటించింది.

కానీ తనకు బయట అభిమానులున్నారని, తన ఎలిమినేషన్ సరైనది కాదని అంటున్నా, ప్రేక్షకులు మాత్రం ఆమెను తిరస్కరించారు. ఇలా స్టూడియో ముందుకు వచ్చి పది మంది చేత గొడవ చేయిస్తే బిగ్ బాస్ తలొగ్గే పరిస్థితి ఉందంటారా? అసలే రేటింగ్స్ లేక బిగ్ బాస్ యాజమాన్యం కిందా మీద పడుతుంటే ఎక్సట్రా ఆఫర్స్ ఏమిటిరా బాబు అనుకుంటున్నారట.