ట్రెండ్ ను బట్టి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కూడా తెలిసి ఉంటేనే మన గల్లా పెట్టే నిండుతుంది. ఒకవైపున కరోనా వైరస్ దెబ్బకు బయట ఫుడ్ తినడం ప్రజలు మానెయ్యడంతో పాటు అసలు బయటకు వెళ్లాలంటేనే బయపడిపోతున్నారు. దీనితో జర్మనీలోని ఒక బేకరీ యజమానికి తీవ్ర నష్టాలు రావడంతో అతడికి ఏమి చేయాలో పాలుపోక తన బేకరీ తిరిగి పుంజుకోవాలని తన ఆలోచనలకు పదును పెట్టి ఏ వైరస్ వలన ప్రజలు భయపడుతున్నారో అదే వైరస్ ఆకారంలో ఉండే కేకులు తయారు చేయడం ఆరంభించాడు.

కరోనా వైరస్ ఆకారంలో ఉండే కేకులు వివిధ రకాల రంగులలో తయారు చేసి వీటిని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయని, ప్రచారం ఆరంబించడంతో అసలు ఈ కేకులో ఏముందో తెలుసుకోవడానికి జనమంతా ఆ ఏరియాలో కరోనా వైరస్ కేక్ తినడానికి ఎగబడుతున్నారట. అతడు చెప్పినట్లు నిజంగానే కేకే చాలా బాగుందని, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందని కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం కరోనా వైరస్ పేరుతో తయారు చేసిన బేకరీ చుట్టూ పక్కలకు వెళ్ళాలంటేనే బయపడుతున్నారట. కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అలా భయపడుతుంది.