కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తీవ్రంగా వణికిస్తోంది. ఇక మహారాష్ట్రలో దీని ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 531 మంది పోలీసులకు కరోనా రావడంతో తీవ్రంగా కలకలం రేపుతోంది. కాగా వీరిలో 39 మంది కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి భారిన పడి మరణించిన పోలీసుల సంఖ్య 5 కి పెరిగింది. ఇక కరోనా భారిన పడిన వారిలో 51 మంది పోలీస్ అధికారులు ఉండగా, 480 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకు 18120 మందికి పాజిటివ్ రాగా, వారిలో 3094 మంది కోలుకున్నారు. ఇక 14375 మంది చికిత్స పొందుతుండగా, 651 మంది మృతి చెందారు.