మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఈరోజు ఒక్కరోజే 123 మంది మృతి చెందడంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 2710 కి చేరింది. ఇక ఈరోజు తాజాగా 2933 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 77793 కి చేరింది.

ఇక వీరిలో 33329 మంది డిశ్చార్జ్ కాగా, 39935 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. రోజురోజుకు మహారాష్ట్రలో భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కరోనా ఇంకా తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

ఎయిమ్స్ లో భారీగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. ఆందోళనలో యాజమాన్యం..!

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం