టీ వేడి వేడిది కాకపోతే చల్లారిపోయింది తాగుతారేమిటిరా అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. అసలు వేడి వేడి టీ తాగకపోతే ఇంకా టీ తాగడమెందుకు దండగా అనుకోవచ్చు. ఉదయం సాయంత్రం వేడి వేడి టీ తాగడం వలన మనస్సుకు కొంతమందికి ఉల్లాసాన్ని ఇస్తుంది. అసలు టీ తాగకపోతే రోజు మొదలుపెట్టనివారు కూడా ఎందరో ఉన్నారు.

కానీ వేడిగా ఉండే టీ తాగడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిగా ఉండే టీ తాగడం వలన అన్నవాహికకు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చైనాకు సంబంధించిన డాక్టర్లు తోమిదేళ్ళ పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. 30 నుంచి 79 ఏళ్ళ వయసుండే వారిపై దీనికి సంబంధించిన ప్రయోగం చేశారట. ప్రతిరోజు పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడంతో పాటు వేడి వేడి టీ లేదా కాపీ తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగినట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక డాక్టర్లు ఏదో ఒక సమయంలో ఏది తీసుకున్నా అనారోగ్యమే అని చెప్పడంతో అసలు ఏమి తినాలో ఏమి తినకూడదో అన్న బయమైతే ప్రజలలో వ్యక్తమవుతుంది.