దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ కనపడిన వారిని పోలీసులు చితగొడుతున్న సంఘటనలు కోకొల్లలు. కొన్ని సంఘటనలలో అయితే కరోనా వైరస్ సంగతి తరువాత పోలీసోడి దెబ్బలకు చావకుండా బయట పడితే అదే నూరేళ్లు అనుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అసలు ఆ సామాన్యుడు ఏమి తప్పు చేసాడో.. ఎందుకు బయటకు వచ్చాడో చెప్పే సమాధానం కూడా వినకుండా కొడుతున్న పోలీసులకు అదే వారి ఇంట్లోనే అలంటి సంఘటన జరిగితే… అప్పుడు తెలుస్తుంది తాను చేసేది కరెక్టా లేక తప్పా అనేది.

నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో ఒక కుర్రోడు ఫ్యూయల్ కోసం బయటకు వచ్చాడు. యధావిధిగా పోలీసు లాక్ డౌన్ సమయంలో రోడ్డెందుకెక్కావని లాగి పెట్టి ఒక్కటిచ్చాడు. దీనితో ఆ కుర్రాడు ఆగ్రహంతో తాను డిపార్ట్మెంట్ కు సంబంధించినవాడినే అని మా డాడీ వచ్చి నీ సంగతి తేలుస్తాడని అగ్రహంగా ఊగిపోయాడు. డాడీ వచ్చాడు.. హీరో లెవెల్ లో తన కొడుకుని కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై విరుచుకుపడ్డాడు. నీ సంగతి తేలుస్తా… ఎస్పీ దగ్గరకు వెళ్తా… డీఎస్పీ దగ్గరకు వెళతానని బీరాలు పలికాడు. ఎస్ఐ వస్తున్నదని చెప్పగానే అక్కడ నుంచి తన కొడుకుని తీసుకొని పలాయనం చిత్తగించాడు. అంటే పక్క వాడి కొడుకుకి ఒక రూల్… నీ కొడుకుకి ఒక రూల్… నువ్వు డిపార్ట్మెంట్ వాడివైతే నీ కొడుకు తప్పు చేస్తే కొట్టకూడదా?

అసలు నువ్వు కూడా అదే డిపార్ట్మెంట్ లో ఉండి డ్యూటీ చేస్తున్న అధికారిపై చెయ్యి చేసుకోవచ్చా? రూల్స్ అనేవి దేశంలో అందరికి ఒకేలా ఉన్నాయి నువ్వు పోలీసు అయినంత మాత్రం… అతడు నీ కొడుకు అయినంత మాత్రాన రాజ్యాంగం కొత్తగా ఏమి రూపొందించలేదన్న సంగతి గుర్తు పెట్టుకొని… నీ కొడుకులానే అందరి తల్లితండ్రులపై వారి పిల్లలకు ప్రేమ ఉంది. కానీ మీరు ప్రవర్తించే చర్యలు ఒక్కోసారి హేయమైనవి అని ఇద్దరు పోలీసుల మధ్య జరిగిన కొట్లాట పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం జరుగుతుంది.