మన దేశంలో మెడికల్ సీటు చాల కాస్ట్లీతో కూడుకున్న వ్యవహారం. ఈ వ్యవహారంతో చాల మంది సీట్లు దొరకక, డబ్బు పెట్టే స్థోమత ఉన్నా మెడికల్ సీట్లు దక్కకపోవడంతో విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కొంత కాలం క్రితం అయితే వైద్య విద్య కోసం చైనా కు వెళ్లి అక్కడ చదువులు వెలగబెట్టి వచ్చేవారు. సరే అక్కడకు వెళ్లి వాళ్ళు ఏమి పొడుస్తున్నారో తెలియదు గాని, అక్కడ చదువుతో ఇక్కడకు వచ్చి వైద్యం చేయాలనుకునే వారు మాత్రం అర్హత సాధించడం లేదట.

భారత వైద్యమండలి వెల్లడించిన వివరాల ప్రకారం ఎంసీఐ అర్హత పరీక్షలలో విదేశాలలో చదువుకొచ్చిన వారికి సందేశంలో నిర్వహించే పరీక్షలలో 80 శాతం మంది ఫెయిల్ అవుతున్నారట. 20 శాతం మంది మాత్రమే ఉతీర్ణత సాధిస్తుండటంతో, కేవలం అకడమిక్ ఉతీర్ణత సాధిస్తే చాలానే ధోరణిలో అక్కడ చదువులపై మన విద్యార్థులు ద్రుష్టి పెట్టడమే దీనికి కారణమని వైద్య మండలి అంచనా వేస్తుంది. విదేశాలలో పొడిసొచ్చానని, పెద్ద చదువు చదివొచ్చానని గొప్పలు చెప్పుకునే డాక్టర్ల కన్నా మన దగ్గర చదువుకున్న డాక్టర్లే మిన్న అని తెలుస్తుంది

  •  
  •  
  •  
  •  
  •  
  •