పెళ్లి చేసుకునేటప్పుడు అందరూ అంగరంగ వైభవంగా ముస్తాబై వారికి స్థాయికి తగ్గట్లు పెళ్లి చేసుకుంటారు. కొంతమంది గుర్రాల మీద ఊరేగుతారు. మరికొంతమంది పెద్ద పెద్ద కార్లలో తీన్మార్ సంబరాల మధ్య పెళ్లి మండపానికి చేరుకుంటారు. కానీ వీటిని కాదని ఒక వధువు మాత్రం శవపేటికలో పెళ్లి మండపానికి ముస్తాబై రావడంతో అక్కడ ఉన్నవారు అందరూ అవాక్కవడం విశేషం.

ఒక మహిళ శవపేటికలో తాను ముస్తాబై పడుకుంది. ఇక ఆ శవపేటికపై నల్లటి వస్త్రాన్ని కప్పారు. ఆ శవపేటికను తీసుకొని పెళ్లి మండపానికి వచ్చిన తరువాత శవపేటికపై కప్పిన నల్లటి వస్త్రం తీసి శవపేటిక తెరవడంతో ఆ వధువు బయటకు వచ్చి అందరికి దర్శనమిచ్చింది. ఇక నేరుగా మండపం మీదకు వెళ్లి తనకు కాబోయే వరుడుతో కలసి రింగులు మార్చుకున్నారు. ఆ మహిళ చావు కూడా పెళ్ళిలో భాగమని బావించిందా, ఎప్పటికైనా చివరకు చేరాల్సింది ఇక్కడికే అని బావించిందా లేక సోషల్ మీడియాలో ట్రెండీగా మారడానికి ఇలాంటి పిచ్చి చేష్టలు చేసిందో తెలియదుగాని ఈ శవపేటిక వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.