మన దేశం పేద దేశమేమి కాదు, అసలు ప్రపంచంలోకల్లా అత్యంత ధనవంతుల దేశమేదంటే భారతదేశమని చెప్పుకోవచ్చు. కానీ మన అప్పులు వ్యవహారాలు చూస్తుంటే ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా కనపడుతుంది. దానికి కారణం మన దేశంలో ప్రతి పనికి లంచం, ప్రతి వీధికొక లంచగొండి ఉంటూనే ఉంటారు. అసలు ప్రభుత్వాధికారులంటేనే లంచగొండులన్న ముద్రను ప్రజలు ఎప్పుడో వేసేసారు. మన దేశంలో ఉన్న లంచగొడుల నుంచి డబ్బును కనుక వెలికితీస్తే మన దేశంలో ప్రపంచంలో అత్యంత సప్పన్న దేశంగా వెలసిల్లుతుంది.

కానీ మన రాజకీయ నాయకులూ దగ్గరుండి వారిని అందలమెక్కించుకోవడం ఇవన్నీ సర్వసాధారంగా జరగడంతో మరొక నాలుగు తప్పులు లంచగొండి చేయడానికి చూస్తాడు తప్ప దానిని నుంచి బయటపడి నీతిగా బతకడానికి ఎవరు ట్రై చేయరు. ఈమధ్య హైదరాబాద్ కీసరలో ఒక ఎమ్ఆర్ఓ కోటి రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడంటే లంచగొండులు మన దేశంలో ఎంతలా పాతుకుపోయి ఉన్నారో తెలుస్తుంది.

మన దేశానికి ఉన్న అప్పులు మొత్తం గత జూన్ నాటికీ 101.3 లక్షల కోట్లను ఒక నివేదిక తెలియచేస్తుంది. గత ఆరు నెలలుగా లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధిక ఇబ్బందుల కారంముగా 6.7 లక్షల రూపాయల ఋణం తెచ్చుకున్నట్లు కేంద్రమే చెబుతుంది. ఇలా మన దేశాన్ని లంచం పేరుతో పీల్చి పిప్పి చేసి మరింత అప్పులలో నెట్టేస్తూ తరువాత వచ్చే వాడు భరిస్తాడు నాకేమి కాదన్న రీతిలో బతుకుతుంటే రాబోయే రోజులలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు.

నిజంగా మన దేశానికి చెందిన రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు బడా బాబులు మొత్తం దాచిన సొమ్మును విదేశాల నుంచి రప్పిస్తే కేంద్రం నెత్తిన ఉన్న 101 లక్షల కోట్ల అప్పుతో పాటు మన దేశం పొరుగు దేశాలకు తిరిగి ఒక 100 లక్షల కోట్లు అప్పు ఇచ్చే స్థాయికి చేరుకుంటుంది. కానీ లంచగొండి జోలికి మాత్రం మన దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఎంతో మంది రాష్ట్రాధినేతలు నుంచి దేశాధినేతల వరకు తాము లంచాని అరికడతామని లెక్చర్లు ఇవ్వడమే తప్ప ఒక్క రూపాయి కదిలించకపోగా, మరింత లంచగొండులను వారే ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ బిల్లుల రూపంలో కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన దేశంలో దారి మళ్లుతుంది. వంద కోట్ల రూపాయల బిల్లుని 300 కోట్ల రూపాయలుగా చూపించి 200 కోట్లు నొక్కేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లు ఇలా దొబ్బేసి ప్రభుత్వాలను మరింత అధః పాతాళానికి దిగజారుస్తున్నారు.

ఆకలితో ఉన్న బెట్టింగ్ రాయుళ్ల దాహం తీర్చడానికి వచ్చేస్తున్న ఐపీఎల్

మందు బాబులు ఎవరి కర్మకు వారే బాధ్యులు