చదవు మీద పట్టుదలతో తనను చిన్నతనంలోనే చదవుకు దూరం చేయడంతో ఒక బామ్మ తనకు చదవుకోవాలన్న ఆశ ఉండటంతో 105 సంవత్సరాల వయస్సులో పరీక్ష రాసింది.కేరళలోని కొల్లంకు చెందిన భగీరథ అనే వృద్ధురాలు పరీక్ష రాసి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది. కుటుంబ సమస్యలతో 9 ఏళ్లకే మానేసిన చదవుని కేరళ ప్రభుత్వం ఈమధ్య “అక్షర లక్ష్యం” అనే కార్యక్రమం చేపట్టగా కేరళ ప్రభుత్వ సహాయసహకారాలతో పుస్తకాలు పట్టి నాలుగవ తరగతికి సమానమైన పరీక్షను రాసింది. ఈ పరీక్షలలో పాల్గొన్న పెద్ద వయస్కురాలు ఆమె కావడం విశేషం. ఈ వృద్ధురాలు ఏ తరగతి పరీక్షలు రాసింది అన్నది ముఖ్యం గాదు, తాను అప్పుడు చదవుకోలేనిది ఈ వయస్సులో తన కోరిక తీర్చుకుంది. కేరళలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా మొదటిగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కేరళలో అక్షరాస్యత అధికంగా ఉండి, నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు.