కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెటింది. ఈ వారం మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, రాహుల్, వితిక ఎలిమినేషన్స్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గోల్డెన్ మెడలియెన్ టాస్క్ లో వితిక విజేతగా నిలవడంతో ఎలిమినేషన్ నుండి బయట పడింది.

దీనితో మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, రాహుల్ లలో ఒకరు ఈ వారంలో ఎలిమినేషన్ అవ్వనున్నారు. ఇప్పుడున్న ముగ్గురిలో మహేష్ విట్టా ఎలిమినేషన్ అవబోతున్నాడని సమాచారం. వరుణ్ సందేశ్ కి బాగా సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అలాగే రాహుల్ కి కూడా ఈ వారం ఎక్కువ శాతం ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది. కావున ఈ వారం మహేష్ విట్టా ఎలిమినేషన్ అవనున్నాడని టాక్ వినిపిస్తుంది.