ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల వ్యవధిలో 13 లక్షల ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు వచ్చాయని అధికారులు గుర్తించారు. ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కదనం ప్రకారం మొత్తం ఓట్లు 3.69 కోట్లు కాగా అందులో 3.7 శాతం ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయని వెల్లడైంది. వీటిపై రెవెన్యూ అధికారులు విచారణ జరపగా అవన్నీ నకిలీ దరఖాస్తులని తేలిందట.

అదే సమయంలో వైసీపీ కి చెందిన వారి ఓట్లను కావాలని తొలగిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు ఏర్పడడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఓట్లు తొలగింపునకు గురి అవుతున్న వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులవని తేలింది.