ఓ హత్య కేసులో 14 ఏళ్ళపాటు జైలు శిక్ష అనుభవించి ఆ తరువాత తన అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు సుభాష్. గుల్భర్గాకు చెందిన సుభాష్.. 1997వ సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశం పొందాడు. అయితే ఆ సమయంలో పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళను ప్రేమించాడు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లవడంతో ఈ విషయం ఆమె భర్తకు తెలిసి సుభాష్ ను హెచ్చరించాడు. అయితే ఆమె భర్త తనకు అడ్డుగా వస్తున్నాడన్న కారణంగా ఆయనను చంపేశాడు.

ఇక ఈ కేసులో జైలుపాలైన సుభాష్.. 14 ఏళ్లపాటు శిక్ష అనుభవించి 2016వ సంవత్సరంలో విడుదలయ్యాడు. కాగా బయటకి వచ్చిన తర్వాత సుభాష్ తన చదువును కొనసాగించాలనుకున్నాడు. అతను బయటికి వచ్చిన తరువాత తిరిగి ఎంబీబీఎస్ లో సీటు సంపాదించుకుని 2019 లో పూర్తి చేసాడు. ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేయడంతో కర్ణాటకలోని కలాబురాగిలో డాక్టర్ గా సేవలు అందిస్తున్నాడు. జైలులో ఉన్న రోజులు తన చదువుపై దృట్టి పెట్టానని.. క్షణాకావేశంతో ఎవ్వరు కూడా ఈ విధంగా తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించాడు సుభాష్.