కేవలం నిమిషాల వ్యవధిలోనే కరోనా నిర్ధారణ పరీక్షా ఫలితాలను అందించగల ఓ నూతన విధానాన్ని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడిలో ఈ ఆవిష్కరణ ఓ గొప్ప మైలురాయిగా నిలబడుతుందని సంస్థ డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రియాసిస్ తెలిపారు. పరీక్షా, ఫలితాల మధ్య చోటు చేసుకుంటున్న జాప్యం వల్ల వివిధ ప్రభుత్వాల కరోనా కట్టడి చర్యలు కుంటుపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్లు తదితర వనరులు పరిమితంగా లభ్యమయ్యే వెనకపడిన దేశాల్లో ఈ విధానం పెను మార్పులు తీసుకురాగలదని టెడ్రోస్ అన్నారు. అనువైన, ఎక్కడికైనా తీసుకువెళ్లగల ఈ కొత్త విధానం కేవలం 15 నుంచి 30 నిమిషాల్లో ఫలితాలను వెల్లడిస్తుందని సంస్థ డైరక్టర్‌ జనరల్‌ వివరించారు.

కేవలం ఆరు నెలల్లో 120 మిలియన్ టెస్ట్ కిట్లు సరఫరా చేసే విధంగా బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌, ఉత్పత్తిదారు అబ్బాట్‌ అండ్‌ ఎస్‌డీ బయోసెన్సార్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీని విలువ 5 డాలర్లను సంస్థ తెలిపింది. దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 133 దేశాల ప్రజలకు ప్రయోజనం లభించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ వివరించారు.