కొద్ది రోజుల క్రితం ఒక జ్యోతి కుమారి అనే యువతి తండ్రి ఒక ప్రమాదంలో అనారోగ్యం పాలయ్యాడు. లాక్ డౌన్ కారణంగా తాము ఉండే ప్రదేశంలో సరైన వసతి లేదు, తినడానికి ఆహారం లేదు, ఇక చేసేది లేక 15 ఏళ్ళ యువతి తాను పొదుపు చేసుకున్న కొంత సొమ్ముతో తన తండ్రిని సైకిల్ పై ఎక్కించుకొని గురుగ్రామ్ నుంచి తన తండ్రిని బీహార్ లోని తన ప్రాంతమైన దర్బారామ్ కు ఎనిమిది రోజుల పాటు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన ప్రాంతానికి చేరుకుంది.

ఇది తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. 15 ఏళ్ళ బాలిక తన తండ్రి కోసం ఇంతటి సాహసం చేసిందా?, ఇప్పుడు వారిద్దరిని వారి గ్రామం సమీపంలో క్వారంటైన్ లో ఉంచారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత సైక్లింగ్ ఫెడరేషన్ వారు ఢిల్లీ పిలిచి వారికి కావలసిన సదుపాయాలు అందచేస్తామని, ఉండటానికి ఇల్లు, బస ఏర్పాటు చేస్తామని, ఒక యువతి ఇలా 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుందని అంటున్నారు.

జ్యోతి కుమారి తన ప్రయాణం గురించి చెబుతూ తాను ఎనిమిదవ తరగతి వరకు చదవుకున్నానని, ఎలాగైనా తన తండ్రిని తమ ప్రాంతం తీసుకొని వెళ్లాలని తలచానని, ఒక్కసారి దేవుణ్ణి తేల్చి తన ప్రయాణం మొదలు పెట్టి రోజుకి 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసానని, తనకు అలసట వచ్చినప్పుడు కాస్త ముఖానికి నీళ్లు చల్లుకుని ఆహారం తీసుకుంటూ, తన తండ్రికి బిస్కట్స్ లాంటివి ఇస్తూ తన ప్రయాణం కొనసాగించమని, తమ కష్టాన్ని చూసి చాలా మంది తమకు సహాయం చేసారని, దారి మధ్యలో ఒక వృద్ధుడు తినడానికి ఆహారం నీళ్లు ఇచ్చి దైర్యం చెప్పి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారని, తాను ఇంకా చదవుకోలేని అనుకుంటున్నాని జ్యోతి కుమారి చెప్పుకొచ్చింది.

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక ఉండటానికి సరైన గూడు లేక పనులు లేక తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని వారు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం సాయం చేస్తుందని చెబుతున్నా ఎంతమందికి సహాయం అందుతుందనేది పెద్ద ప్రశ్నే. ఇలా గత రెండు నెలలుగా ఎంతో మంది నిరాశ్రయులు వందల కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుచుకుంటూ తమ ప్రాంతాలకు చేరుతున్నా ప్రభుత్వం దయతో వ్యవహరించకుండా వారి నిబంధనలు మాత్రమే పాటించారు తప్ప వారికి వాహన సదుపాయం కల్పించి గమ్యస్థానాలకు మాత్రం చేర్చలేదు. ఇప్పుడు గత వారం రోజులుగా గమ్యస్థానాలకు చేర్చడానికి రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. గత రెండు నెలలుగా వందల కిలోమీటర్లు నడిచి సరైన తిండిలేక అస్వస్థతకు గురై గుండెలాగిపోయిన ప్రాణాలెన్నో.

శకుని పాత్ర చేసిన తరువాత తన కాళ్ళు విరగగొడతామన్నారు