పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరికి ఆవరణంలో కరోనా పరీక్షలు చేశారు. అయితే కరోనా పరీక్షలో సుమారు 17 మంది ఎంపీలకు పాజిటివ్ గా తేలింది. వీరిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు కరోనా భారిన పడ్డారు. అదేవిధంగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, డీఎంకే, శివసేన, ఆర్ఎల్పి పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడు కరోనా టెస్టులు చేయించుకోవడాన్ని తప్పనిసరి చేశారు. దీంతో తాజాగా 17 మంది సభ్యులకు వైరస్ సోకింది.

తెలంగాణ సీఎం సంచలనం.. ఇక పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు..!

చిక్కుల్లో స్టార్ హీరో.. కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ హైకోర్టు జడ్జి ఆగ్రహం..!