లాక్ డౌన్ 4.0 దాదాపుగా పూర్తి సడలింపులతో కొనసాగుతుండటంతో ఈరోజు నుంచి అన్ని షాపులు తెరుచుకున్నాయి. మాల్స్, థియేటర్లు తప్ప మొత్తం తెరుచుకోవడంతో ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు కళకళ లాడుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ హడావిడి నుంచి కాస్త బయటకు వచ్చి నిరుద్యోగుల కోసం వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వ్యవసాయ విస్తరణాధికారుల గ్రేడ్ 2 (AEO) పోస్టుల ప్రక్రియకు పర్మిషన్ ఇచ్చారు. దీనితో ఖాళీగా ఉన్న 194 ఏఈవో గ్రేడ్ 2 పోస్ట్లు భర్తీ చేపట్టనున్నట్లు వ్యవసాయ సఖ ప్రకటించింది. అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో వ్యవసాయ సఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలియచేసారు.

కరోనా మాస్కుల వల్ల ఆ సమస్యలు వస్తాయట..!

ప్రముఖ నిర్మాత ఇంట్లో కరోనా కలకలం..!

దిక్కుమాలిన టిక్ టాక్ ఇద్దరిని బలిగొంది