కరోనా వైరస్ ప్రభావంతో మాస్కులు దొరక్క ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక మెడికల్ షాప్ లలో మాస్క్ లు పదింతలు ఎక్కువ రేటుకి మాస్క్ లను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా మాస్క్ కావాలంటే అడిగినంత ఇచ్చి తీసుకెళ్లండని చెప్పడంతో ప్రజలంతా చేసేది లేక మాస్క్ లను ఎక్కువ ధర పెట్టి కొనడం జరుగుతుంది.

కానీ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఒక సర్జికల్ షాప్ నిర్వాహకుడు విద్యార్థులకు, హాస్పిటల్ సిబ్బందికి రెండు రూపాయలకే మాస్క్ లను అమ్ముతూ వార్తలలో నిలుస్తున్నారు. తాము గత ఎనిమిదేళ్లుగా మాస్క్ లను అమ్ముతున్నామని బయట రేట్లు పెంచి అమ్ముతున్నా తాము మాత్రం రెండు రూపాయలకే మాస్క్ లు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీనితో ఇప్పుడు ఆ షాప్ అతడు వార్తలలో నిలవడంతో పాటు ప్రజలకు సేవాభావంగా ఉండవలసిన షాప్ వాళ్ళు ఇలా ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటుంటే ఈ షాప్ వ్యక్తిని చూసి అందరూ నేర్చుకోవాలని అంటునాన్రు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 6500 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మన భారత్ లో ఇద్దరు చనిపోవడంతో పాటు 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.