డిమానిటైజషన్ తరువాత ఎస్బీఐ బ్యాంకు తన బ్యాంకు లావాదేవీలలో చాల మార్పులు చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఆర్బీఐ సూచన మేరకు త్వరలో తన ఎస్బీఐ ఏటీఎంల నుంచి 2000 రూపాయలకు సంబంధించి క్యాసెట్లను తీసివేయనుందట. భవిష్యత్తులో 100, 200 రూపాయల నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ఎస్బీఐ సంస్థ బావిస్తుందట. ప్రస్తుతానికి 2 వేల రూపాయల నోట్లు తొలగించినా 500 రూపాయలు నోట్లు అందుబాటులో ఉంటాయని, వాటిని కూడా విడతల వారీగా తొలగించి 100, 200 రూపాయలు నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలకు ఉపక్రమించారు.

ఇలా చేయడం వలన ఏటీఎంలలో నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండటంతో ఆ మేరకు లావాదేవీల పరిమితిని పెంచాలని యోచిస్తున్నారట. మెట్రో నగరాలలో 10 సార్లు ఇతర నగరాలలో 12 సార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఈమధ్య ఎస్బీఐ ఏటీఎంలను కూడా చాల వరకు తగ్గించి వేసింది. త్వరలో డెబిట్ కార్డు సిస్టంను కూడా ఎత్తి వేసి అందరూ డిజిటల్ వైపు అడుగులు వేసేలా ప్రణాళికలు రచించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇలా చేయడం వలన ఏటీఎం నుంచి ఒకేసారి పెద్ద అమౌంట్ తీసుకోవాలి అనుకున్న వారికి కష్టాలనే చెప్పుకోవచ్చు.