ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ళ క్రిందట సరిగ్గా ఇదే రోజు పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ డిమోనిటైజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో 2000 నోట్లపై పలు రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ 2 వేల నోటును రద్దు చేయాలని గార్గ్ అభిప్రాయపడుతున్నారు. డిమోనిటైజేషన్ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 వేల నోట్లు ప్రధానంగా ఉన్నాయని.. వీటిని ఇప్పుడు అక్రమ టెండర్ గా ప్రకటించవచ్చని గార్గ్ తెలిపారు. 2 వేల నోట్లను చలామణి నుండి ఉపసంహరించడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని.. పెద్ద నోట్ల స్థానాల్లో తెచ్చిన 2 వేల నోట్లను ఇప్పుడు రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

2000 నోట్లను దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయని.. వ్యవస్థలో నగదు చలామణి భారీగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లిపు వ్యవస్థ వేగంగా విస్తరిస్తుందని.. భారత్ లో మాత్రం నెమ్మదించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను డిజిటల్ చెల్లింపుల దిశగా వేగవంతం చేసే చర్యలను తీసుకోవాలని.. ఇందుకోసం నగదు చెల్లింపులపై పన్నులను, చార్లీలను విదించాలన్నారు.