రామజపం మనం వినే ఉంటాం. మన దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు రామునిని కొలుస్తూ రామజపం పల్లెల నుంచి పట్నాల వరకు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మోదీ జపంతో ఒక యూట్యూబర్ సంచలనం కలిగించాడు. ఇష్టమైన సినీ హీరోల పేరుతో దానాలు ధర్మాలు చేసేవారిని చూసాం. కానీ ప్రధానికి వినూత్నంగా ఆన్ మోల్ బకాయ అనే వ్యక్తి చేసిన మోదీ జపం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఏకంగా 24 గంటల పాటు ప్రధాని మోదికి జన్మదిన శుభాకాంక్షలు ఆన్లైన్ స్ట్రీమింగ్ లో చెబుతూ మధ్యలో ఎక్కడ ఆపకుండా అతడు చేసిన జపం ఇప్పుడు అతడు ట్రేండింగ్ గా మారిపోయాడు.

దాదాపుగా 24 గంటలలో అతడు 1,03,643 సార్లు మోదీ జపం చేసాడు. అతడు మోదీ జపం చేసే సమయంలో యూట్యూబ్ లో కింద కౌంట్ కూడా పాడింది. ఇలా అతడు చేసిన జపం చూస్తుంటే అతడికి ప్రధానిపై ఎంతటి మమకారం ఉందో తెలుస్తుంది. ప్రధాని పుట్టిన రోజు నాడు అనేకమంది రాజకీయనేతలు, సెలెబ్రేటిస్ శుభాకాంక్షలు చెప్పి తన అభిమానాన్ని చాటుకుంటే వారికి వినూత్నంగా యూట్యూబ్ లో అతడి చేసిన పనికి అందరూ ఔరా అంటున్నారట.