సరిగ్గా 25 ఏళ్ళ క్రితం 1994 సెప్టెంబర్ 9వ తేదీన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన మొదటి సెంచరీని చేశాడు. కొలొంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 130 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సచిన్ తన తొలి సెంచరీ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరపున మెక్ గ్రాత్, షేన్ వార్న్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని సచిన్ మొదటి సెంచరీ చేశాడు.

సచిన్ కొట్టిన మొదటి సెంచరీ మ్యాచ్ లో ఇండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. సచిన్ వన్ డేలలో 49 సెంచరీలు చేయగా, అన్ని ఫార్మెట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు. ఇక సచిన్ మొదటి సెంచరీ చేసి 25 సంవత్సరాలు కావడంతో ట్విట్టర్ లో సచిన్ కు అభిమానులు విషెష్ చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •