కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 170 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఈ వైరస్ భారిన పడ్డారు. ఇక 16 వేలకు పైగా ఈ మహమ్మారికి గురై మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక భారత్ లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 490 మందికి ఈ వైరస్ సోకగా, పది మంది దీని భారిన పడి మృతి చెందారు.
ఇక ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే భారత్ లో 30 కోట్ల మంది దీని భారిన పడతారని.. సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ(సీడీడీఈపీ) డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి పకడ్బందీ చర్యలు ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ సంఖ్యను 20 కోట్లకు తగ్గించవచ్చని లేదంటే దాదాపు 25 లక్షల మంది మృత్యువాత పడొచ్చని హెచ్చరించారు. అమెరికా, బ్రిటన్ లో ఈ వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసి ఈ వివరాలు చెబుతున్నామని రమణన్ తెలియచేసారు.