నోయిడాలో 35 ఏళ్ళ టెక్కీ తన తల్లిదండ్రులతో కలసి కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు కొత్త వాహన చట్టంలో మార్పులు కారణంగా ఆపడం జరిగింది. దానితో ఆ టెక్కీ పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడంతో గుండెపోటుకు గురయ్యాడు. తనను హాస్పిటల్ కు తీసుకొని వెళ్లే లోపే మృతి చెందాడు. దీనిపై అతని తండ్రి మాట్లాడుతూ ఈరోజు పోలీసుల కారణంగా తన కొడుకుని పోగొట్టుకున్నానని, తన ఐదేళ్ల మనవరాళ్లు అనాథలా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసాడు.

పోలీసులు నిబంధనల ప్రకారం సున్నితంగా వ్యవహరించాలి తప్ప కఠినంగా వ్యవహరించకూడదని, అతను ఆరోపించారు. తనకు ప్రధాని మోదీనే న్యాయం చేయాలని అన్నారు. చనిపోయిన టెక్కీకి డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కువగా ఆవేశానికి లోనవవడం వలనే ఇలా జరిగినట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •