అన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ కు సంబంధించిన కేసులను దాచిపెడుతూ తామేదో ఉద్ధరిస్తున్నామని ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనకడుగేయకుండా కొన్ని వేల సంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తూ ఎక్కడ కరోనా కేసులు బయటపడితే వాటి సంఖ్యను బహిర్గతం చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆంధ్రాలో రోజు రోజుకి పెరుగుతున్నాయి.

లాక్ డౌన్ పెట్టిన మొదటి రెండు నెలలు గుంటూరు జిల్లా తెనాలిలో దాదాపుగా కరోనా వైరస్ కేసులు లేకపోయినా చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన ఒక యువకుడితో మొదలైన కేసులు రోజు రోజుకి దారుణంగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ఒక్కరోజే తెనాలిలో 38 కేసులు రాగా, ఏకంగా ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. దీనితో తెనాలి ప్రజానీకం ఒక్కసారి ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. తెనాలిలో పాక్షికంగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి లాక్ డౌన్ పెట్టే సూచనలున్నాయని తెలుస్తుంది. తెనాలి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.