నేను ఒక కొత్త బిజినెస్ పెడుతున్నా అని అందులో మీరు కనుక పెట్టుబడి పెడితే మీకు డబ్బులు నెల నెల దండిగా వస్తాయని, మీకు ఇక లాభాల పంట అని మీ జీవితాలు మారిపోతాయని ఇలా మన దేశంలో ఏదో ఒక మూలాన ప్రతి రోజు కుచ్చుటోపీలు పెడుతూనే ఉంటారు. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో స్వాతి అనే మహిళా టప్పర్ వెర్ బిజినెస్ పేరిట నమ్మించి మోసం చేసి నిలువునా ముంచడంతో వారంతా ఇప్పుడు కుయ్యో మొర్రో అనడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.

నల్లగొండ శివాజీ నగర్ లో స్వాతి అనే మహిళ టప్పర్ వెర్ బిజినెస్ పేరిట ఒక షాప్ రెంట్ కు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఉదనే వారిని నమ్మించడంతో టప్పర్ వెర్ వ్యవపారంలో లాభాలు బాగా వస్తాయని నెలకు మీకు కమిషన్ ల రూపంలో బాగా సంపాదించవచ్చని నమ్మబలకడంతో ఒక మహిళ అయితే ఏకంగా 1.30 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. మరొక మహిళ 15 లక్షల రూపాయలు ఇలా మొత్తం 15 మంది మహిళలు 4 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంతో మొదటి రెండు నెలలు డబ్బులు బాగానే ముట్టచెప్పింది. ఆమె డబ్బులు బాగానే ఇస్తుందని నమ్మకం కుదరడంతో మరికొంతమంది ఆమెకు డబ్బులు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు.

కానీ మోసగత్తె స్వాతి ఎక్కువరోజులు వ్యవహారం నడపకుండా తనకు రావాల్సిన డబ్బులు వచ్చాయని అనుకునందో ఏమో, రెండు నెలలు తరువాత వారికి డబ్బులు ఇవ్వడం ఆపేసింది. దీనితో వారంతా కలసి స్వాతిని ప్రశ్నించడంతో ఆమె అసలు మీరు పెట్టిన పెట్టుబడికి ఒక రసీదు గట్రా ఏమైనా ఉన్నాయా? మీరు నన్ను ఏమి చేయలేరనట్లు బరితెగించడంతో వారంతా ఏమి చేయాలో పాలుపోక లోకల్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని జిలా ఎస్పీకి తెలియచేయడంతో అతడు కేసు ఫైల్ చేయించి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అనేక రూట్ లలో మోసం చేసి ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయి తమ దగ్గర డబ్బులేదని తీసుకున్న నాలుగు కోట్లకు ఒక 50 లక్షలు బయట పెట్టి వాటిని వారికి ఇచ్చి చేతులు దులుపుకుని సంఘటనలు ఎన్నో ఎనెన్నో.