మెగాస్టార్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన హావ కొనసాగిస్తూ, ఎవరకి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు చిరంజీవి. తాను ఈరోజుతో సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టి 41 ఏళ్ళు. సరిగ్గా 1978లో ఇదే రోజున ప్రాణం ఖరీదు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలై అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ‘ప్రాణం ఖరీదు’ సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా చిరంజీవి తన కెరీర్ లో వెనుతిరిగి ఎప్పుడు చూసుకోలేదు. 2009 ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి తన రెండవ ఇన్నింగ్స్ ను ‘ఖైదీ నెం 150’తో మొదలుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా దాదాపుగా 270 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలావాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక జరగనుంది. ఈ వేడుకకు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు ఇండస్ట్రీ నుంచి బారీ తారాగణం దిగిరానున్నారు. ‘సైరా’ సినిమా గాంధీ జయంతి వేడుకను పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •