మనిషి ప్రాణం అంటే లెక్క లేకుండా అకారణంగా తీసే రోజులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక వ్యక్తికి ఐదు రూపాయలు ఇవ్వవలసి వస్తే వాటిని అడిగినందుకు కోపంతో అతడి ప్రాణాలు తీసిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని రామ్ దులర్ సింగ్ అనే వ్యక్తి గ్యాస్ నింపించుకోవడానికి గ్యాస్ స్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ గ్యాస్ నింపించుకున్న తరువాత తనకు రావలసిన ఐదు రూపాయల చిల్లర అడగడంతో షాప్ అతడు లేవని చెప్పడంతో, తన ఐదు రూపాయలు తనకు ఇవ్వాలని గట్టిగా అడగడంతో అక్కడ పనిచేసే సిబ్బంది అతడిని దారుణంగా చితకబాదారు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలవ్వడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చి వారిని అరెస్ట్ చేసారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •